![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -352 లో.. మురారి, కృష్ణ ఇద్దరు కేసు ఇన్వెస్టిగేషన్ కోసం వెళ్లారని భవానికి రేవతి చెప్తుంది. అప్పుడే కృష్ణని ఎత్తుకొని మురారి వస్తుంటాడు. రేవతి వంక భవాని కోపంగా చూస్తుంది. ఏమైంది కృష్ణని మురారి అలా తీసుకొని వస్తున్నావని మధు అడుగుతాడు. కృష్ణ కాలు బెనికింది. కృష్ణకి నడవరావట్లేదని మురారి చెప్తాడు.
ఆ తర్వాత కృష్ణ కాలికి మురారి స్ప్రే కొడుతుంటే భవాని, ముకుంద ఇద్దరు చూడలేకపోతారు. కోపంగా భవాని వెళ్లిపోతుంటే.. ఆగండి పెద్దమ్మ మీతో మాట్లాడాలని మురారి అంటాడు. ఆ తర్వాత కృష్ణ కాలిని పట్టుకుని మురారి మసాజ్ చేస్తుంటాడు. కావాలనే నన్ను రెచ్చగొట్టలి అని మురారి ఇదంతా చేస్తున్నాడని భవాని అనుకుంటుంది. దానికి తోడు ముకుంద కూడా చూసారా అత్తయ్య మీ మాటలు అంటే విలువ లేదని ఇంకా రెచ్చగొడుతుంది. ఆ తర్వాత పరిమళకి మురారి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్తాడు. అప్పడు పరిమళ మెడికల్ షాప్ లో ఉండి ఫోన్ లో మాట్లాడుతు ఉంటుంది. అదే మెడికల్ షాప్ కీ దేవ్ వస్తాడు. పరిమళని గుర్తు పట్టి త్వరగా అక్కడ నుండి దేవ్ వెళ్ళిపోతాడు. దూరం నుండి పరిమళ దేవ్ ని చూస్తుంది. మరొకవైపు ఇక్కడికి ఇప్పుడు పరిమళ ఇంకా స్కెచ్ ఆర్టిస్ట్ శ్రీధర్ వస్తున్నాడు. పరిమళ నాకు సర్జరీ చెయ్యించిన అతనికి సంబందించిన క్లూలు ఇస్తుంటే శ్రీధర్ అతన్ని గీస్తాడని మురారి అంటాడు. దాంతో ముకుందకి టెన్షన్ స్టార్ట్ అవుతుంది. దేవ్ కి ఫోన్ చేసి ఇంటికి రాకుండా చూడాలని అనుకొని దేవ్ కి ఫోన్ చేస్తుంది కానీ అతని ఫోన్ స్విచ్చాఫ్ అఫ్ వస్తుంది. ముకుంద టెన్షన్ పడడం కృష్ణ గమనిస్తు ఉంటుంది.
మరొకవైపు దేవ్ ఇంటికి వస్తాడు. దేవ్ వైపు మధు అనుమానంగా చూస్తాడు. నువ్వు డౌట్ పడాలిసింది నాపై కాదు మురారి కేసుకి సంబంధించిన వ్యక్తి పైన అని దేవ్ అంటాడు. అ తర్వాత దేవ్ దగ్గరకి ముకుంద వచ్చి పరిమళ, శ్రీధర్ వస్తున్న విషయం చెప్తుంది. సరే వెనకాల డోర్ నుండి నీ గదికి వస్తానని ముకుందకి దేవ్ చెప్తాడు. మరొకవైపు నాకు ఎందుకో దేవ్ పై డౌట్ ఉందని కృష్ణతో మధు చెప్తాడు. వాళ్ళ ఫ్యామిలీ అందరు డిఫరెంట్ అని కృష్ణ అంటుంది. అప్పుడే మురారి వచ్చి కృష్ణని తీసుకొని వెళ్తాడు. తరువాయి భాగంలో కృష్ణ, మురారి ఇద్దరు కలిసి భవాని పక్కన కలిసి కూర్చొని భోజనం చెయ్యాలని ప్లాన్ చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |